యాంటీ క్యాన్సర్‌గా `కీర‌దోస`.. ఆ బెనిఫిట్స్ కూడా!

క్యాన్స‌ర్‌.ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన రోగ‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మాయ‌దారి క్యాన్స‌ర్ కార‌ణంగా ప్ర‌తి సంవ‌త్స‌రం కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ముందు మ‌నిషిని మాన‌సికంగా కృంగ‌దీసే క్యాన్స‌ర్‌.

Cucumber Helps To Recover From Cancer! Cucumber, Cancer, Latest News, Health Tip

ఆ త‌ర్వాత శారీర‌కంగానూ, ఆర్థికంగానూ దెబ్బ తీస్తుంది.అందుకే క్యాన్స‌ర్ వ‌చ్చాక బాధ ప‌డ‌టం కంటే.

ముందుగానే ఆరోగ్యంపై త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది.అయితే క్యాన్స‌ర్ రోగం బారిన ప‌డ‌కుండా ఉండాలంటే.

Advertisement

ఖ‌చ్చితంగా కొన్ని ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి.అలాంటి వాటిలో కీరదోస కూడా ఒక‌టి.

అవును కీర‌దోస యాంటీ క్యాన్స‌ర్‌గా ప‌ని చేస్తుంది.ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో కీర‌దోస తీసుకోవ‌డం వ‌ల్ల‌.

అందులో ఉండే ఫాలీఫినాల్స్, ఫైటోన్యూట్రీయంట్స్ శ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాల‌తో పోరాడి.వాటిని పెర‌గ‌కుండా అడ్డుకుంటుంది.

అలాగే క్యాన్స‌ర్ ఉన్న వారు కూడా రెగ్యుల‌ర్‌గా కీర‌దోస తీసుకుంటే.యాంటీ క్యాన్స‌ర్‌గా ప‌ని చేసి త్వ‌ర‌గా రిక‌వ‌ర్ అయ్యేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అలాగే కీర‌దోసతో మ‌రిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.కిడ్నీలో రాళ్లు స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న వారు కీర‌దోసను ప్ర‌తి రోజు తీసుకోవాలి.

Advertisement

అలా చేయ‌డం వ‌ల్ల కిడ్నీలో రాళ్లు క‌ర‌గ‌డ‌మే కాదు.శ‌రీరంలో మలినాలు, విషపదార్థాలు కూడా సులువుగా బయటకు పోతాయి.

కీర‌దోస‌లో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది.అందువ‌ల్ల, రెగ్యుల‌ర్ డైట్‌లో కీర‌దోస‌ను చేర్చుకుంటే.

డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటారు.త‌ర‌చూ కీర‌దోస తీసుకోవ‌డం వ‌ల్ల‌.

అందులో ఉండే విట‌మిన్ సి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌రుస్తుంది, విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగుప‌రుస్తుంది, విట‌మిన్ బి మ‌రియు పొటాషియం గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.అలాగే కీర‌దోస‌లో విట‌మిన్ కె కూడా ఉంటుంది.

ఇది ఎముకల‌ను గ‌ట్టిగా మారుస్తాయి.ఇక ప్ర‌తి రోజు కీర‌దోస తీసుకుంటే.

చ‌ర్మం కూడా ఎప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా ఉంటుంది.

తాజా వార్తలు