వారణాసి నగరం ఇప్పుడు మహా కుంభమేళా( Mahakumbh Mela ) భక్తులతో కిక్కిరిసిపోయింది.రైల్వే స్టేషన్లు జనంతో నిండిపోయి ట్రైన్లలో( Trains ) సీటు దొరకడం దాదాపు అసాధ్యంగా మారింది.
ఇంత రద్దీలో వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లో( Varanasi Cantt Railway Station ) ఊహించని సీన్ కనిపించింది.ఫిబ్రవరి 8, శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వారణాసి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు( Prayagraj ) వెళ్లే ట్రైన్ ప్లాట్‌ఫామ్ నంబర్ టూపై ఆగింది.
ట్రైన్ ఆల్రెడీ ఫుల్ కావడంతో బోగీల్లో చోటు లేక జనం ఏకంగా ట్రైన్ ఇంజన్‌లోకి( Train Engine ) ఎక్కేశారు.అంతేకాదు డోర్ కూడా లోపలి నుంచి లాక్ చేసేశారు.
ఇంకేముంది, ఇంజన్‌నే ప్యాసింజర్ బోగీలా మార్చేసి కూర్చున్నారు.

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అవుతోంది.దాదాపు 20 మందికి పైగా మగ, ఆడవాళ్లు ట్రైన్ ఇంజన్‌లో కూర్చుని ఉన్నారు.చూస్తే ఎవరైనా బోగీ అనుకుంటారేమో అంతలా సీన్ ఉంది.
వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP) రంగంలోకి దిగారు.ఇంజన్‌లో కూర్చున్న ప్రయాణికులందరినీ బయటకు లాగారు.
ఇంజన్‌లో ఉండటం ఎంత ప్రమాదకరమో వారికి వివరించారు.ట్రైన్ కంట్రోల్ చేసే ముఖ్యమైన భాగాలు ఇంజన్‌లోనే ఉంటాయని, ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా పెద్ద ప్రమాదం జరగవచ్చని సీరియస్‌గా చెప్పారు.
ప్రయాణికుల భద్రత కోసం వెంటనే వాళ్లని బోగీల్లోకి పంపించేశారు.

మహా కుంభమేళాకి లక్షలాది మంది భక్తులు వారణాసికి క్యూ కట్టారు.టెంపుల్స్, ఘాట్స్, పుణ్యక్షేత్రాలు ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు.దర్శనం కోసం 3-4 కి.మీ మేర జనాలు క్యూలో నిలబడుతున్నారు.కాశీలోని 84 ఘాట్‌లు జనంతో నిండిపోయాయి.
రైల్వే, బస్టాండ్ స్టేషన్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.జనం పోటెత్తడంతో ప్రయాణికులు సేఫ్టీ రూల్స్ పాటించాలని రైల్వే అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
స్టేషన్లలో రద్దీని కంట్రోల్ చేయడానికి ఎక్స్‌ట్రా సెక్యూరిటీని పెట్టారు.ట్రైన్లలో అనుమతి లేని ప్రదేశాల్లోకి వెళ్లొద్దని, అది చాలా రిస్క్ అని అధికారులు చెబుతున్నారు.







