Srikanth : బాహుబలికి కట్టప్ప ఎలాగో దేవరకు శ్రీకాంత్ అలా.. అలాంటి పాత్రలో కనిపించనున్నారా?

టాలీవుడ్( Tollywood ) పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా దేవర.

ఈ సినిమాను కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తోంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.అంతేకాకుండా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ గాసిప్ కూడా సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతోంది.

Advertisement

అదేమిటంటే ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్లో దేవర ఓల్డ్ లుక్ లో కనిపించనున్నాడని అది ఫ్లాష్ బ్యాక్ లీడ్ అని తెలుస్తోంది.హీరో శ్రీకాంత్ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఈ ట్విస్ట్, గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా నిలుస్తోందని పైగా ఈ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని ఎన్టీఆర్ ఓల్డ్ పాత్రలోని సరికొత్త వేరియేషన్స్ ను చూపిస్తారని తెలుస్తోంది.

అంటే బాహుబలి సినిమాకు కట్టప్ప( Kattappa ) ఎలాగో దేవర సినిమాకి శ్రీకాంత్ ( Srikanth )అలా అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఒకవేళ అదే కనుక నిజమైతే ఇంటర్వెల్ సీన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది అని చెప్పవచ్చు.

దేవర సినిమాను దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట.ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.అందుకు తగ్గట్టుగా ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు