తెలంగాణలో బలమున్న స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ – సీపీఐ మధ్య పొత్తు విషయంపై జాతీయ నాయకత్వం చర్చలు జరుపుతోందని తెలిపారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ సీపీఐ పోటీ చేస్తుందని చాడ స్పష్టం చేశారు.మహిళా రిజర్వేషన్ బిల్లును ఎన్నికల అస్త్రంగా బీజేపీ మార్చుకుందని విమర్శించారు.
కేవలం ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతోనే బిల్లును ప్రవేశపెట్టిందని మండిపడ్డారు.







