కోటికి చేరుకున్న కరోనా కేసులు..!

కరోనా వైరస్.ప్రపంచ దేశాలను ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రోజు రోజుకు ఈ కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కొన్ని లక్షలమందిని బలితీసుకుంది.

Corona Cases, World Wide, Corona Positive, Coronavirus Spread-కోటికి

ప్రపంచవ్యాప్తంగా కోటిమందికి కరోనా కేసులు నమోదు అయ్యాయి.అయితే అందులో 54 లక్షల మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు.అయితే 5 లక్షలమంది ఈ కరోనా వైరస్ కు బలయ్యారు.46 లక్షల మంది కరోనాతో పోరాడుతున్నారు.ప్రపంచ దేశాలను వణికించిన ఈ వైరస్ 2019 డిసెంబర్ 31నా సార్స్‌ తరహా వైరస్‌ కేసులు చైనాలోని వూహాన్‌లో వెలుగులోకి వచ్చాయి.

అయితే అప్పటికి మాములు వైరస్ అని అనుకున్నప్పటికీ శరవేగంగా ఈ వైరస్ విస్తరించటంతో కొత్త వైరస్ అని మందులేదు అని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.ఇంకా అప్పటి నుండి ఒక్కో దేశం వ్యాపించడం వల్ల ఒక్కో దేశంలో లాక్ డౌన్ విధిస్తు వచ్చారు.

Advertisement

అయితే చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ కు అగ్రరాజ్యం అయినా అమెరికా సైతం చిగురుటాకులా వణికిపోయింది.తొలి రెండు, మూడు నెలలు చైనాలోని వూహాన్‌తో పాటుగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, యూకే దేశాలు అల్లాడిపోయాయి.

ఆతర్వాత ఒక్కో దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుతూ వచ్చాయి.అయితే మన దేశంలో లాక్ డౌన్ ఉన్న అన్ని రోజులు కరోనా కేసులు తక్కువ ఉన్నప్పటికీ లాక్ డౌన్ ఎత్తి వేశాక కరోనా వైరస్ కేసులు దారుణంగా పెరిగిపోయాయి.ప్రస్తుతం మన దేశంలోనూ 5లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవ్వగా అందులో 3లక్షల మంది కరోనా భాదితులు కోలుకోగా, 2 లక్షల మంది కరోనా చికిత్స పొందుతున్నారు.16 వేలమంది కరోనా బారిన పడి మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు