పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గర పెళ్లి చేసుకోవడానికి వచ్చిన జంట.. చివరకు?

నటుడిగా నటించిన సినిమాలు 29 మాత్రమే అయినా ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించడంతో పునీత్ రాజ్ కుమార్ కు గుర్తింపు దక్కింది.46 సంవత్సరాల వయస్సులోనే పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం ఎంతోమంది అభిమానులను బాధ పెట్టింది.

పునీత్ రాజ్ కుమార్ నటుడిగా మాత్రమే కాక నిర్మాతగా, సింగర్ గా, టీవీ ప్రెజంటర్ గా గుర్తింపును సంపాదించుకున్నారు.

ఎన్నో సేవా కార్యక్రమాలను సొంత ఖర్చులతో నిర్వహిస్తూ పునీత్ రాజ్ కుమార్ ఎంతోమంది ఆదర్శంగా నిలిచారు.పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు ఏకంగా 25 లక్షల మంది హాజరయ్యారంటే ప్రజల్లో ఆయనకు ఏ స్థాయిలో గుర్తింపు ఉందో అర్థమవుతుంది.

ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు కంఠీరవకు చేరుకుని పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించుకుంటున్నారు.అయితే తాజాగా ఒక జంట పునీత్ రాజ్ కుమార్ సమాధి ఎదుట పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

Couple Comes To Get Marriage Infront Of Puneeth Raj Kumar Grave , Couple Comes,

గంగ, గురు ప్రసాద్ అనే ఇద్దరు ప్రేమికులు నిన్న పెళ్లి చేసుకోవడానికి పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గరకు వెళ్లారు.వీళ్లిద్దరూ పునీత్ రాజ్ కుమార్ కు వీరాభిమానులు కావడంతో పాటు గత రెండు సంవత్సరాలుగా వీళ్లు ప్రేమలో ఉన్నారు.అయితే పోలీసులు గంగ, గురు ప్రసాద్ ల పెళ్లికి అనుమతులు ఇవ్వకపోవడంతో గంగ, గురు ప్రసాద్ బాధతో అక్కడినుంచి వెనుదిరిగారు.

Advertisement
Couple Comes To Get Marriage Infront Of Puneeth Raj Kumar Grave , Couple Comes,

పునీత్ రాజ్ కుమార్ అంటే ఎంతో అభిమానం ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ జంట తెలిపింది.

Couple Comes To Get Marriage Infront Of Puneeth Raj Kumar Grave , Couple Comes,

పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గర మ్యారేజ్ చేసుకోవడానికి తమ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని ఈ జంట చెప్పుకొచ్చారు.పెళ్లి చేసుకోవడానికి పోలీసుల నుంచి అనుమతి లభించలేదని వాళ్లు పేర్కొన్నారు.ప్రేమికుల రిక్వెస్ట్ గురించి రాజ్ కుమార్ కుటుంబం స్పందిస్తూ పెళ్లికి సంబంధించి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే ప్రేమ జంటలు తమ కుటుంబ సభ్యుల అనుమతితోనే పెళ్లి చేసుకోవాలని సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు