దీపావళి నాటికి కరోనా అదుపులోకి వస్తుందంటున్న కేంద్ర మంత్రి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య ఎక్కువైపోతుంది.

దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తీవ్రంగా ఒకపక్క కృషి చేస్తుంటే మరోపక్క శాస్త్రవేత్తలు దీన్ని నిర్మూలించడానికి మెడిసన్ ను కనుగొనే ప్రయత్నంలో బిజీబిజీగా ఉన్నారు.

మనదేశంలో కూడా కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ రికవరీ రేటు ఆశాజనకంగా ఉంది.అందుకే ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించింది.

తాజాగా అనంత్‌కుమార్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన నేషనల్‌ ఫస్ట్‌ వెబ్‌ సెమినార్‌లో పాల్గొన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ కరోనా దేశంలో దీపావళి నాటికి అదుపులోకి వస్తుందని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.కరోనా మనకెన్నో కొత్త విషయాలను నేర్పిందని మన జీవన విధానంలో మార్పులు తెచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని కరోనా వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్పుడే కరోనాను కట్టడి చేసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.అలాగే ఈ ఏడాది చివరిలోపు కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
జగన్ వర్సెస్ షర్మిల : విజయమ్మ తీరుపై వైసిపి అనేక ప్రశ్నలు 

తాజా వార్తలు