కరోనా పై షాకింగ్ న్యూస్ విడుదల

యూఎస్ఏ: కరోనా మహమ్మారి దెబ్బకు అతలాకుతలమైన యావత్ ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఆండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ మరో బాంబు పేల్చింది.

ఈ సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో కరోనా వైరస్ వ్యాప్తిపై షాకింగ్ విశేషాలు వెలువడ్డాయి.

గాలి ద్వారా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని నివేదిక సారాంశం.కరోనా బారిన పడిన రోగి నుంచి వెలువడే తుంపర్లు గాలి ద్వారా ప్రయాణించి వైరస్ వ్యాప్తికి కారణమవుతాయని నివేదిక వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియ ఊపందుకుంటున్న వేళ, తాజా నివేదిక సారాంశం సమస్త మానవాళిని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయా దేశాల ప్రభుత్వాలు భౌతిక దూరం పాటించడంపై విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి సహకారం అంతంతమాత్రంగానే ఉండటంతో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టి నట్టే పట్టి మళ్ళీ విజృంభిస్తుంది.

ఆరడుగుల భౌతిక దూరం పాటించడంపై ప్రభుత్వాలు ఎన్నివిధాలుగా హెచ్చరించినా ప్రజలు వాటిని గాలికొదిలేసి తమ రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమైపోతున్నారు.తాజా నివేదిక ప్రకారం గాలి, వెలుతురు సరిగా ప్రసరించని గదుల్లో వైరస్ ఊహించిన దాని కంటే వేగవంతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

Advertisement

కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఆరడుగుల కంటే ఎక్కువ భౌతిక దూరాన్ని పాటించడం శ్రేయస్కరమని నిపుణుల అభిప్రాయం.కాగా, ఇదే సంస్థ వారు గతంలో కూడా గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రకటించినప్పటికీ, కొందరు నిపుణులు అది నిరాధారమని కొట్టిపారేశారు.

తాజాగా ఈ విషయం మరోసారి నిర్దారణ కావటంతో ప్రపంచదేశాలు మరోసారి లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.వ్యాక్సిన్ వచ్చే వరకు వైరస్ ను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు