దేశంలో కరోనా డేంజర్ బెల్స్, ఎప్పుడూ లేనంతగా...

ఒకపక్క సడలింపులతో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఇండియాలో మాత్రం కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

గతంలో ఎప్పుడూ లేనంతగా కరోనా కేసులు పెరిగిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోన్న అంశం.

గత వారం రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.కేసులు పెరుగుతున్న సమయంలో సడలింపులు ఇవ్వడం కేసులు పెరిగేందుకు మరొక కారణం అవుతున్నది అనడంలో సందేహం అవసరం లేదు.

6088 New Positive Corona Cases In India Within 24 Hours, Corona Cases,India,

తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో ఇండియాలో 6088 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 1,18,447 కేసులు నమోదుకాగా, 3,583 మంది మరణించినట్లు తెలుస్తుంది.

రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.ఇక ఇదిలా ఉంటె ప్రపంచంలో కూడా కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండడం తో ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తమయ్యాయి.

Advertisement

గత 24 గంటల్లో లక్ష కేసులు నమోదవ్వడం తో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారిగా తెలుస్తుంది.మొత్తం మీద ఇప్పటి వరకు 51.32 లక్షల కేసులు నమోదు కాగా, 3.34 లక్షల మందికి పైగా మరణించారు.అమెరికా, రష్యాలో వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు