చ‌పాతీల‌కు బ‌దులు వీటిని తింటే వేగంగా బ‌రువు త‌గ్గుతారు..తెలుసా?

సాధార‌ణంగా చాలా మంది బ‌రువు త‌గ్గాల‌నే ఉద్దేశంలో వైట్ రైస్‌ను వ‌దిలేసి చ‌పాతీల‌ను తింటుంటారు.

అయితే గోధుమ‌ల‌తో త‌యారు చేసే చ‌పాతీల కంటే మొక్క‌జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం ద్వారా మ‌రింత వేగంగా బ‌రువు త‌గ్గొచ్చు.

ఐర‌న్‌, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫ‌రస్, జింక్‌, కాప‌ర్‌, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విట‌మిన్ బి 1, విట‌మిన్ బి 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లావిన్, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు మొక్క‌జొన్న‌ల్లో నిండి ఉంటాయి.అందుకే మొక్క‌జొన్న‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా మొక్క‌జొన్న పిండితో త‌యారు చేసిన రొట్టెల‌ను తీసుకుంటే అతి ఆక‌లి త‌గ్గు ముఖం ప‌డుతుంది.చిరుతిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.

దాంతో క్ర‌మంగా వెయిట్ లాస్ అవుతారు.పైగా చ‌పాతీల బ‌దులు మొక్క‌జొన్న రొట్టెల‌ను తింటేనే ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గుతారు.

Corn Flour Roti Can Helps To Lose Weight Fast Corn Flour Roti, Weight Loss Tips
Advertisement
Corn Flour Roti Can Helps To Lose Weight Fast! Corn Flour Roti, Weight Loss Tips

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు మొక్క‌జొన్న రొట్టెల‌ను తింటే గ‌నుక.అందులోని ఫైటోకెమికల్స్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఎప్పుడూ అదుపులో ఉండేలా చూస్తాయి.ర‌క్త హీన‌త స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు చ‌పాతీల‌కు బ‌దులుగా మొక్క‌జొన్న రొట్టెల‌ను తీసుకుంటే.

శ‌రీరానికి ఐర‌న్ పుష్క‌లంగా అందుతుంది.ఫ‌లితంగా ఎర్ర ర‌క్త క‌ణాలు వృద్ధి చెంది ర‌క్త హీన‌త ప‌రార్ అవుతుంది.

అంతే కాదు, మొక్క‌జొన్న పిండితో త‌యారు చేసిన‌ రొట్టెల‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే చ‌ర్మం యవ్వనంగా, కాంతి వంతంగా మారుతుంది.హెయిర్ ఫాల్ స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

కిడ్నీ సంబంధిత వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ పెర‌గ‌కుండా ఉంటుంది.

పోషకాల ఘనీ : బ్లూ బెర్రీస్

గుండె ఆరోగ్య వంతంగా మారు తుంది.మ‌రియు కంటి ఆరోగ్యం సైతం మెరుగ్గా అవుతుంది.

Advertisement

కాబ‌ట్టి, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారే కాకుండా ఎవ్వ‌రైనా మొక్క‌జొన్న రొట్టెల‌ను డైట్‌లో చేర్చుకోవ‌చ్చు.

తాజా వార్తలు