సిగరెట్ తాగుతూ కాళీ మాత పోస్టర్.. వివాదంలో లేడీ డైరెక్టర్!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ట్రెండ్ కు తగ్గట్టుగా బోల్డ్ కంటెంట్ ను పరిచయం చేయాలి అనుకుంటూ ఉండగా అనుకోని లేనిపోని వివాదాలు చుట్టుముడుతున్నాయి.అలా సినీ ఇండస్ట్రీ వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది.

 Controversy On Kaali Documentary Film Case Filed On Director Leena Manimekalai-TeluguStop.com

తాజాగా ఇప్పుడు మరొక వివాదం నెలకొంది.తాజాగా నెలకొన్న ఈ వివాదానికి కారణం ఒక మహిళా దర్శకురాలు.

పూర్తి వివరాల్లోకి వెళితే.కాళీ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిలింను తెరకెక్కిస్తున్నారు.

ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ని విడుదల చేశారు.ఆ పోస్టర్ లో కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టుగా ఉంది.

దీంతో ఆ పోస్టర్ పై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.ఒక చేతిలో సిగరెట్ మ‌రో చేతిలో ఎల్జీబీటీ సంబంధించిన జెండాను ప‌ట్టుకోవ‌టం కూడా కాంట్ర‌వ‌ర్సీకి కార‌ణ‌మవున్నాయి.

ఈ డాక్యుమెంటరీ ఫీలింను.లీనా మ‌ణిమేక‌లై ఈ డాక్యుమెంట‌రీని రూపొందిస్తున్నారు.

అంతే కాకుండా ఈ పోస్టర్ పై పలువురు స్పందిస్తూ హిందూ దేవతను ఇంత దారుణంగా కించపరుస్తారా? అంటూ పోస్టర్ పై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ డాక్యుమెంటరీ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Goddesss Kaali, Kaali-Movie

హిందువుల మనసును బాధపెట్టిన ఆ డాక్యుమెంట‌రీ డైరెక్ట‌ర్ లీనా మ‌ణి మేక‌లైను అరెస్ట్ చేయమని స‌ద‌రు హిందూ సంఘాలు కోరుతున్నాయి.కొంద‌రైతే పోలీస్ స్టేష‌న్స్‌లో ఫిర్యాద‌లు కూడా చేశారు.ఢిల్లీలో అయితే ఎఫ్ఐఆర్ న‌మోదైంది.అయితే ఈ వివాదంపై డైరెక్ట‌ర్ లీనా మ‌ణి మేక‌లై కూడా గ‌ట్టిగానే స్పందించారు.స‌మాన హ‌క్కుల గురించి ప్ర‌స్తావించే అంశంతో ఈ డాక్యుమెంట‌రీని రూపొందించాన‌ని ఆమె తెలిపారు.కాళీ మాత సిగ‌రెట్ తాగుతున్న‌ట్లు ఉన్న పోస్ట‌ర్‌పై ఆమె రియాక్ట్ అయ్యారు.

వాక్ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం కూడా చేస్తానంటూ లీనా అన్నారు.కాళిమాత ఓ చేత్తో సిగ‌రెట్ తాగుతూ మ‌రో చేత్తో త్రిశూలం, గొడ్డ‌లి ప‌ట్టుకుని ఉండడంతో ఈ పోస్ట‌ర్‌పై ఢిల్లీకి చెందిన అజ‌య్ గౌత‌మ్ పోలీసుల‌కు, హోం శాఖ‌కు ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube