Vijay Devarakonda: విజయ్ దేవరకొండను వెంటాడుతున్న కాంట్రావర్సీలు.. ఇప్పటికీ ఎన్నిసార్లు వివాదాల్లో చిక్కుకున్నాడంటే..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ప్రస్తుతం యూత్ లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ మామూలుగా లేదు .

హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా విజయ్ కి ఉన్న క్రేజ్ రోజురోజుకి పెరుగుతూనే ఉంది.లైగర్ మూవీతో( Liger ) పరాజయం చవిచూసిన విజయ్ దేవరకొండ రీసెంట్ గా రిలీజ్ అయిన ఖుషి( Kushi ) మూవీతో హిట్ అందుకున్నాడు.

అయితే ఖుషి సినిమా విజయం సాధించిన సందర్బంగా విజయ్ దేవరకొండ చేసిన ఒక ప్రకటన కాంట్రావర్సీగా మారింది.అయితే ఇదంతా విజయ్ కి కొత్తేమి కాదు.ఇప్పటికే విజయ్ దేవరకొండ చాలా వివాదాలను ఎదుర్కొన్నాడు.

ఆ వివాదాలెంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అర్జున్ రెడ్డి :-

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా( Arjun Reddy ) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు విజయ్.చిన్న సినిమా గా తెరకేక్కిన అర్జున్ రెడ్డి ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా తో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ అయ్యాడు .అయితే ఈ మూవీ  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఉపయోగించిన ఒక పదం వివాదానికి దారి తీసింది.

దాని పై యాంకర్ అనుసూయతో( Anasuya ) పాటు చాలామంది  సెలబ్రిటీలు కామెంట్స్ చేశారు.అలానే ఫిలిం కంపానియన్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో మలయాళ నటి పార్వతి, విజయ్ దేవరకొండ ముందే అర్జున్ రెడ్డి మూవీ గురించి నెగిటివ్ కామెంట్స్ చేసింది.దానికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఆమె అభిప్రాయం ఆమెది అంటూ కామెంట్ చేసాడు.

గీత గోవిందం :-

ఈ సినిమాలోని ఒక పాట లో ‘ఎఫ్’ అక్షరాన్ని హైలైట్ చేస్తూ విజయ్ పాట పాడాడు.ఈ పాటలోని లిరిక్స్‌ కూడా అభ్యంతరకరంగా ఉండడంతో వివాదానికి దారి తీసింది.లిరిక్స్ అందించిన శ్రీమణి( Lyricist Srimani )  క్షమాపణలు చెప్తూ ప్రకటన రిలీజ్ చేశారు.

నోటా :-

ఈ సినిమా పై డైలాగ్ రైటర్ శశాంక్ వెన్నెలకంటి( Shashank Vennelakanti ) కేసు పెట్టారు.రాజకీయ పరంగా కూడా ఈ మూవీ పై వివాదాలు ఏర్పడ్డాయి.ఈ విషయం పై విజయ్ స్పందిస్తూ తననే ఎందుకు కాంట్రవర్సీలు చుట్టుముడుతున్నాయో అర్ధం కావడం లేదు, నోటా మూవీ( Nota Movie ) విషయంలో కేవలం కాంగ్రెస్ నాయకులే గొడవ చేస్తున్నారని అన్నారు.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

లైగర్ :-

పూరి జగనాథ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో దేవరకొండ అయ్య తెల్వడు, తాత తెల్వడు అని అనడం వివాదానికి దారి తీసింది.అంతేకాకుండా 200 కోట్ల నుండి మొదలు పెడుతున్న అని అనడం కూడా కాంట్రవర్సీ గా మారింది.

Advertisement

ఖుషి :-

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.వైజాగ్ స‌క్సెస్ టూర్‌లో పాల్గొన్న విజ‌య్ మాట్లాడుతూ ఖుషి మూవీకి తాను తీసుకున్న పారితోషికం నుండి కోటి రూపాయ‌ల్ని, వంద కుటుంబాల‌కు లక్ష రూపాయల చొప్పున పంచుతాను అని తెలిపాడు.ఈ ప్రకటన పై చాలా మంది దేవరకొండను ప్రశంసించారు.

అయితే వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ మూవీని రిలీజ్ చేసిన అభిషేక్‌ పిక్చర్స్‌ ఈ మూవీ వల్ల తాము నష్టపోయామని, తమకు కూడా అండగా ఉండాలి అంటూ విజయ్ కి ట్వీట్ చేయడం వివాదానికి దారి తీసింది.

తాజా వార్తలు