ఈ `టీ`ని రోజుకు ఒక క‌ప్పు తీసుకుంటే గ్యాస్ అన్న మాటే అన‌రు!

వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మందిని స‌ర్వ సాధార‌ణంగా వేధించే జీర్ణ స‌మ‌స్య‌ల్లో గ్యాస్ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, వేళ‌కు ఫుడ్ తీసుకోక‌పోవ‌డం, ఒత్తిడి, బాక్టీరియా వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ వీక్ అయిపోతుంటుంది.

దాంతో గ్యాస్ స‌మ‌స్య త‌ర‌చూ వేధిస్తూ ఉంటుంది.దీన్ని నివారించుకోవ‌డం కోసం ఎన్నెన్నో మందులు, టానిక్స్ వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే వ‌ర్రీ అవ్వ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే `టీ`ని తీసుకుంటే గ్యాస్ అన్న మాటే అన‌రు.

మ‌రి లేటెందుకు ఆ టీ ఏంటో, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

Advertisement

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో చిన్న దంచిన అల్లం ముక్క‌, ప‌ది లేత వేప ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు ఎండిన చామంతి పూలు వేసి చిన్న మంటపై ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగించాలి.ఆపై వాట‌ర్‌ను స్ట్రైన‌ర్ సాయంతో ఫిల్ట‌ర్ చేసుకుని.

అందులో వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ వేసుకుని మిక్స్ చేస్తే చామంతి వేప టీ సిద్ధం అవుతుంది.

ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ప్ర‌తి రోజు ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు ఈ టీను తీసుకుంటే.వ్య‌ర్థాల‌న్నీ బ‌య‌ట‌కు పోయి జీర్ణ వ్య‌వ‌స్థ శుభ్రంగా మారుతుంది.

దాని ప‌ని తీరు కూడా మెరుగు ప‌డుతుంది.దాంతో గ్యాస్ ఒక్క‌టే కాదు ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం, క‌డుపు ఉబ్బ‌రం వంటి ఇత‌ర జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు సైతం ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

అంతేకాదు, ఈ చామంతి వేప టీని రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకుంటే నిద్రలేమి స‌మ‌స్య దూరం అవుతుంది.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా మారుతుంది.

Advertisement

జ‌లుబు, ద‌గ్గు వంటి సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.నెల‌స‌రి స‌మ‌యంలో వేధించే నొప్పులు ప‌రార్ అవుతాయి.

మ‌రియు ఒత్తిడి, ఆందోళ‌న, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల నుండి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

తాజా వార్తలు