వ్యాయామాల త‌ర్వాత ఈ స్మూతీని తీసుకుంటే వేగంగా వెయిట్ లాస్ అవుతారు!

ఇటీవల రోజుల్లో అధిక బరువు సమస్య నుంచి బయట పడటం కోసం చాలా మంది వ్యాయామాలను తమ డైలీ రొటీన్ లో భాగం చేసుకుంటున్నారు.

రోజుకు కనీసం ఇరవై, ముప్పై నిమిషాలైనా వ్యాయామాలు చేస్తుంటారు.

గంటల తరబడి వ్యాయామాలు చేస్తూ చెమటలు చిందించే వారు కూడా ఉన్నారు అయితే వ్యాయామాలు చేసిన తర్వాత శరీరంలో శక్తి మొత్తం తగ్గిపోతుంది.విపరీతమైన ఆకలి వేస్తుంటుంది.

ఆ సమయంలో కొందరు ఏది పడితే అది తినేస్తుంటారు.తద్వారా వ్యాయామల వల్ల వచ్చే ప్రయోజనాలను కోల్పోతుంటారు.

అందుకే వ్యాయామం చేసిన అనంతరం సరైన ఫుడ్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement
Consume This Smoothie After Workouts For Fast Weight Loss, Weight Loss, Weight L

వ్యాయామలు అనంతరం ఈ స్మూతీని తీసుకుంటే వేగంగా బరువు తగ్గడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు సైతం లభిస్తాయి.మరి ఇంతకీ ఆ స్మూతీ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక అవ‌కాడో పండును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి.

లోప‌ల ఉండే ప‌ల్ప్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.అలాగే ఒక అర‌టి పండును తొక్క తొల‌గించి స్లైసెస్‌గా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో అవకాడో ప‌ల్ప్‌, క‌ట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్ వేసుకోవాలి.

Consume This Smoothie After Workouts For Fast Weight Loss, Weight Loss, Weight L

అలాగే ఒక గ్లాస్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ చియా విత్తనాలు, వన్ టేబుల్ స్పూన్ బాదం పొడి, వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ స్మూతీ సిద్దమైనట్టే.ఈ స్మూతీని వ్యాయామాల అనంతరం తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.అతి ఆకలి దూరం అవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

వేగంగా బరువు తగ్గుతారు.నీరసం అలసట వంటివి సైతం ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు