దోస పంటను( Cucumber Crop ) ఆశించే పొక్కు తెగులు( Blister Rot ) ఒక ఫంగస్ ద్వారా వ్యాపిస్తుంది.మట్టిలో ఉండే పగుళ్లలో ఈ ఫంగస్ ( Fungus ) అవశేషాలు జీవించి ఉంటాయి.
గాలిలో తేమ అధికంగా ఉండే సమయాలలో ఈ పొక్కు తెగులు విపరీతంగా వ్యాప్తి చెందుతాయి.ఈ తెగులు మొక్కలను ఆశించిన తర్వాత ఐదు రోజులకు కణజాలంలో తెగుల లక్షణాలను గుర్తించవచ్చు.
మొక్కల ఆకులపై పాలిపోయిన ఆకుమచ్చ తెగులు ఏర్పడి, క్రమంగా పొడిగా మారి ఆకులపై రంద్రాలు ఏర్పడితే ఆ మొక్కలకు పొక్కు తెగులు సోకినట్లు నిర్ధారించుకోవాలి.తరువాత పండ్ల మీద చిన్న బూడిద మచ్చలు ఏర్పడడం, జిగురు కారుతున్న మచ్చలు ఏర్పడడం జరుగుతుంది.
చివరగా పండ్లు మొత్తం కుళ్లిపోయే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో నకిలీ విత్తనాల రూపంలో రకరకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.కాబట్టి తెగులు నిరోధక, ఆరోగ్యమైన విత్తనాలను సర్టిఫైడ్ దుకాణాల నుండి కొనుగోలు చేసి ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.
పొలంలో, పొలం గట్లపై ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేయాలి.నేలలో తేమశాతం అధికం కాకుండా మొక్కల మధ్య కాస్త దూరం ఉండేటట్లు నాటుకోవాలి.
అలా చేస్తే సూర్యరశ్మి, గాలి వల్ల నేలలో తేమశాతం తగ్గుతుంది.

పంట పొలంలో ఏవైనా మొక్కలకు తెగులు సోకినట్లు కనిపిస్తే వెంటనే పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.ఇక పిచికారి మందులు ఉపయోగించి ఈ పొక్కు తెగుల వ్యాప్తి అధికం కాకుండా తొలిదశలోనే అరికట్టాలి.మాంకోజెబ్, క్లోరో తలోనిల్ లలో ఏదో ఒక దానిని మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
ఎక్కువగా సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యం ఇవ్వాలి.వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవాలి.
ఇలా అన్ని సంరక్షణ చర్యలు తీసుకుని వ్యవసాయం చేస్తే మంచి దిగుబడి పొందవచ్చు.