గోమతి చక్రధారణ వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..?

గోమతి చక్రం శ్రీ కృష్ణుని చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది.అందుకే ఈ చిత్రాన్ని విష్ణుచక్రం అని, నాగ చక్రం అని పిలుస్తారు.

ఈ గోమతి చక్రాలలో కొన్ని చక్రాలు ముందుభాగం తెలుపు రంగులో ఉంటాయి.మరికొన్ని ఎరుపురంగును కలిగి ఉంటాయి.

అయితే తెలుపు రంగును కలిగి ఉన్న గోమతి చక్రాలు పూజా కార్యక్రమంలో, సకల కార్యాలకు, మంచి ఆరోగ్యం పొందటానికి ధరిస్తారు.అదేవిధంగా ఎరుపు రంగు కలిగిన చక్రాలను క్షుద్రపూజలకు, శత్రు వినాశనానికి, వశీకరణ కోసం ఈ చిత్రాలను ఉపయోగిస్తారు.

అయితే ఈ గోమతి చక్రాలను ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.* మనం ప్రతిరోజు తాగే నీటిలో ఒక గోమతి చక్రం వేసి ఆ నీటిని తాగటం వలన మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

Advertisement
Consequences Of Gomati Chakra Retention, Gomathi Chakra, Retention, Srikrishna,

అదే విధంగా ఈ చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించటం వల్ల ఎలాంటి చెడు ప్రభావం మనపై పడకుండా కాపాడుతుంది.* రెండు గోమతి చక్రాలను మన బీరువాలో డబ్బులు దాచేచోట పెట్టడం వల్ల మన ఇంట్లో అభివృద్ధి జరుగుతుంది.

భార్య భర్తల మధ్య అన్యోన్యత లేనివారు రెండు గోమతి చక్రాలను పరుపుకింద ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్థలు తలెత్తకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటారు.*మనకు డబ్బు ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోతే వారి పేరును మూడు గోమతి చక్రాల పై రాసి నీటిలో వేయడం ద్వారా మనకు రావాల్సిన డబ్బులు వస్తాయి.

Consequences Of Gomati Chakra Retention, Gomathi Chakra, Retention, Srikrishna,

* నాలుగు గోమతి చక్రాలను పొడి చేసి పంట పొలంలో వేయటం వల్ల పంట అధిక దిగుబడిని సాధిస్తుంది.అదేవిధంగా ఇంటి నిర్మాణం చేపట్టే కార్యక్రమంలో వీటిని వేయటం వల్ల ఆ ఇల్లు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు.గోమతి చక్రాలు ధరించడం వల్ల ఈతిబాధలు తొలగి పోవడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు