కేసిఆర్ కు రేవంత్ సవాల్ !  ఫార్మ్ హౌజ్.. హంటర్ రోడ్ ఎక్కడైనా 

ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పైన,  ఆ పార్టీ అధినేత కేసిఆర్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై బిఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని రేవంత్ తీవ్రంగా ఖండించారు.

 Congress Pcc Chief Revanth Reddy Challenges Cm Kcr,warangal, Kcr, Brs, Telangana-TeluguStop.com

తన పాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తూ ఉండడం చూసి ఓర్వలేక,  తమ నాయకుడి పై దాడి చేశారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.దాడులే ప్రాతిపదికగా రాజకీయం చేద్దామంటే కెసిఆర్ తేదీ స్థలం ప్రకటించాలని రేవంత్ అన్నారు.

కెసిఆర్ ఫామ్ హౌస్ అయిన వరంగల్ హంటర్ రోడ్డు అయినా,  ఎక్కడైనా తాను సిద్ధమైన అంటూ రేవంత్ సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా వరంగల్ అభివృద్ధి అంశం పైన రేవంత్ స్పందించారు.దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వరంగల్ కు 2014లో గ్రహణం పట్టిందని మండిపడ్డారు  కొడంగల్ లో తనపై కోపంతో అభివృద్ధి చేయలేదని,  వరంగల్ నియోజకవర్గంలో కొండా దంపతుల పైన కోపంతో వరంగల్ ను కుప్ప తొట్టిలా మార్చారని రేవంత్ మండిపడ్డారు.వరంగల్ లో ఉన్న బీఆర్ఎస్ నాయకులను దండుపాళ్యం ముఠా అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.

వరంగల్ లో బీఆర్ఎస్ కార్యకర్తలకు గంజాయి అలవాటు చేశారని రేవంత్ విమర్శలు చేశారు.

వరంగల్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనేక కబ్జాలకు పాల్పడుతున్నారని, తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండుసార్లు పడటం కట్టారని , కాంగ్రెస్ కు కూడా ఒక అవకాశం కల్పించాలని రేవంత్ ప్రజలను కోరారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారని, రాష్ట్రంలో మూడువేల వైన్ షాపులు , 60 వేల బెల్ట్ షాపులు కేసీఆర్ తీసుకొచ్చారని, దీని కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,  కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉంటే బట్టలూడదీసి కొట్టి బొక్కలో వేయిస్తానంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube