తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన మాస్టర్ ప్లాన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మాస్టర్ ప్లాన్ ను మున్సిపాలిటీకే పరిమితం చేయాలన్నారు.
రైతుల భూములను మాస్టర్ ప్లాన్ లో చేర్చవద్దని చెప్పారు.ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బాధ్యత తీసుకొని మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించుకునేలా చేయాలని తెలిపారు.
ప్రభుత్వ భూములు ఉండగా పట్టా భూముల్లో జోన్లు ఎందుకని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని వెల్లడించారు.







