సంగారెడ్డి జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో( chemical factory ) రియాక్టర్ పేలిన ఘటనలో బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ( Congress )ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు ( Former minister Harish Rao )అన్నారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.
అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ మంత్రులు మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారని ఆరోపించారు.ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టకపోగా బాధితులపై లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.