టీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత.. ?

తెలంగాణలో త్వరలో సరికొత్త రాజకీయ కోణం బయటపడేలా కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

దీనికి కారణం ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ బయటకు పంపడమే అన్న విషయం తెలిసిందే.

ఇలా మొదలైన రాజకీయ నిప్పు ఇంకా ఆరిపోకుండా ఢిల్లీ వరకు వెళ్లింది.ఇకపోతే ఈటల తన రాజకీయ భవిష్యత్తు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Congress Leader Dasoju Sravan Sensational Comments On Etela Joining Bjp, Congres

ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జెపి నడ్డాతో సమావేశం కానున్న సంగతి తెలిసిందే.అయితే ఈ విషయంలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ తన ఆధిపత్యం కోసం ఈటలతో పాటుగా ఆయన కుటుంబం పై కేసులు పెడుతు ఆయనను అణగద్రొక్కాలని చూస్తున్నారంటూ పైర్ అయ్యారు.ఇలా వదిలి పెట్టకుండా తోడేళ్ల చేస్తున్న దాడిని తప్పించుకోవడానికే ఈటల బిజేపిలో చేరుతున్నారని అన్నారు.

Advertisement

ఇక తెలంగాణాలో టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా కాకుండా, ఫాల్తూ పార్టీగా మారిందని విమర్శించారు.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

తాజా వార్తలు