షర్మిల కు కాంగ్రెస్ కీలక పదవి కట్టబెట్టబోతుందా..?

తెలంగాణ ( Telangana ) లో రాజన్న రాజ్యం తెస్తానని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడమే కాకుండా పాదయాత్ర చేసి కూడా వైఎస్ఆర్టిపి పార్టీని తెలంగాణ లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ షర్మిలకు కాలం కలిసి రాలేదని చెప్పుకోవచ్చు.

కనీసం ఈమె పార్టీలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరు.

ఒకానొక సందర్భంలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు ఆమె రాకను అంగీకరించలేదు.ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ వెనుకబడిపోతుంది అని నిర్ణయించుకొని షర్మిల ( Sharmila ) ను పక్కన పెట్టారు.

Congress Is Going To Give A Key Post To Sharmila, Ys Sharmila, Ys Jagan,

ఇక కాంగ్రెస్లోని కొంతమంది సీనియర్లు తనని కావాలనే దూరం పెట్టారు అనే కోపంతో షర్మిల మీడియా ముఖంగానే నేను తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి కాంగ్రెస్ ( Congress ) ని ఓడగొడతాను అంటూ శపథాలు చేసింది.కానీ ఇవేవీ ఫలించలేదు.చివరికి ఎన్నికలు కొద్దిరోజులు ఉన్నాయి అనగా కాంగ్రెస్లో నా పార్టీ విలీనం చేయకపోయినా నేను ఈసారి ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటాను.

Congress Is Going To Give A Key Post To Sharmila, Ys Sharmila, Ys Jagan,

నా పూర్తి మద్దతు కాంగ్రెస్ కే అంటూ సంచలన నిర్ణయం తీసుకుంది.అయితే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసే కంటే ముందే ఆంధ్రప్రదేశ్లో ఆమెకు కీలకపదవి ఇస్తామని కాంగ్రెస్ వాళ్లు చెప్పినప్పటికీ ఆమె వినలేదట.అయితే తాజాగా కాంగ్రెస్ అధిష్టానం షర్మిల కి కీలక పదవి కట్టబెట్టబోతున్నట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
Congress Is Going To Give A Key Post To Sharmila, Ys Sharmila, Ys Jagan,

వైయస్ షర్మిలను కర్ణాటక ( Karnataka ) నుండి రాజ్యసభకు పంపించి అక్కడ ఆమె గళం వినిపించేలా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందట.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తామని,ఆమె ఒప్పుకుంటే ఏపీ కాంగ్రెస్ లో కూడా ఆమెకి కీలక పదవి ఇస్తామని ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ఇటీవలే చెప్పారు.

అయితే షర్మిల కర్ణాటక నుండి రాజ్యసభకు వెళ్తుందా లేదా ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక పదవిలో కొనసాగుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు