హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా

హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ధర్నా చేపట్టనుంది.ఇండియా కూటమి పిలుపు మేరకు కాంగ్రెస్ నిరసన కార్యక్రమం నిర్వహించనుంది.

ఇందిరాపార్క్ వద్ద జరిగే ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పాల్గొననున్నారు.తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ధర్నాలు చేయనున్నారు.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇటీవల ఇద్దరు ఆగంతకులు చొరబడి స్మోక్ బాంబుతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.దీనికి భద్రతా వైఫల్యమే కారణమని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే ఆ ఘటనను నిరసిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే హ్యాష్ ట్యాగ్ తో కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చింది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు