జగిత్యాలలో బీజేపీ( BJP ) నిర్వహించిన విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) కీలక వ్యాఖ్యలు చేశారు.మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర లిఖించబోతున్నారని తెలిపారు.
లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పనైపోతుందన్నారు.బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్( Congress,BRS ) కొట్టుకుపోతాయని మోదీ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చిన మోదీ 400 సీట్లు దాటాలని చెప్పారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన అవినీతిని ఒకరినొకరు కవర్ చేసుకుంటున్నారని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన పార్టీయే ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) లో కమీషన్లు తీసుకుందని ఆరోపించారు.కుటుంబ పార్టీల హయాంలోనే రూ.లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని తెలిపారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు.







