హైదరాబాద్ చందానగర్లో కల్తీ ఐస్ క్రీమ్ల కలకలం చెలరేగింది.కల్తీ పదార్థాలతో కలిపి ఐస్ క్రీమ్లను ఓ ముఠా తయారు చేస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు.
బ్రాండెడ్ స్టిక్కర్లను అంటించి విక్రయాలు సాగిస్తున్నారని నిర్ధారించారు.కాగా గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీమ్లను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.
పక్కా సమాచారంతో ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.10 లక్షల విలువ చేసే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.