టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) తాజాగా నటించిన చిత్రం కల్కి.( Kalki ) నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటించింది.
ఇకపోతే ఈ సినిమా మరొక రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
కాగా ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించిన విషయం తెలిసిందే.ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.ఇది ఇలా ఉంటే కల్కి సినిమాలో తన ఆర్ట్‌ను కాపీ కొట్టారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌పై విమర్శలు గుప్పిస్తున్నాడు.సౌత్ కొరియాకు( South Korea ) చెందిన సంగ్ చై( Sung Choi ) కాన్సెప్ట్ డిజైనర్‌గా హాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలకు పని చేశాడు.తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కల్కి యూనిట్ తన ఆర్ట్‌ను కాపీ కొట్టిందని పేర్కొంటూ అందుకు తగ్గ సాక్ష్యాన్ని సైతం పొందుపరిచాడు.
పదేళ్ల క్రితం తను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన విజువల్ ఫోటోను కల్కి ట్రైలర్( Kalki Trailer ) ప్రారంభంలోని ఒక విజువల్ స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్ చేశాడు.

ఒకరు కష్టపడి తయారు చేసిన ఆర్ట్‌ను దొంగిలించడం అనైతికం అని క్యాప్షన్ జోడించాడు.తర్వాత కాసేపటికి ఆ క్యాప్షన్ తొలగించి కల్కి సినిమా, వైజయంతి మూవీస్ అన్న హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు.ఆ రెండు ఫోటోలు చూసిన నెటిజన్లు ఇలా కాపీ కొట్టారేంటని ఆశ్చర్యపోతున్నారు.
నీ వర్క్ దొంగిలించారని ఇట్టే తెలిసిపోతుంది.ఆ నిర్మాతలు ప్రభాస్ లుక్ లీక్ చేసినందుకే వీఎఫ్‌ఎక్స్ కంపెనీపై దావా వేశారు.
నువ్వు కూడా నీ ఆర్ట్ కాపీ కొట్టారని కోర్టుకు వెళ్లు అని ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.