టీడీపీ నేతలపై కావాలనే కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.తాము ప్రజల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఏ ఒక్క కేసులోనూ చంద్రబాబుకు కానీ, తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ తెలిపారు.చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనలు శాంతియుతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశామన్న నారా లోకేశ్ న్యాయపోరాటం కూడా చేస్తామని స్పష్టం చేశారు.అదేవిధంగా త్వరలోనే ఏపీలో యువగళం పాదయాత్రను పున: ప్రారంభిస్తామని వెల్లడించారు.