పవన్ కు దగ్గరవ్వాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్న అలీ.. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా?

పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) అలీ( Ali ) కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.

కొన్నేళ్ల క్రితం వరకు పవన్, అలీ మధ్య సత్సంబంధాలు ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

అలీ వైసీపీలో( YCP ) చేరి ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆ పార్టీకి సైతం గుడ్ బై చెప్పి ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో అలీ ముఖ్య పాత్రలో నటించగా ఈ సినిమాలో అలీ నటనకు నెగిటివ్ మార్కులు పడ్డాయి.అయితే అలీ పవన్ కు దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) మూవీ ఈవెంట్ లో అలీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

ఈవెంట్ లో నాని( Nani ) ఉపయోగించిన ఎర్ర తుండు, కడియం, పుస్తకాన్ని సుమ చూపించగా అలీ ఎర్ర తుండు తీసుకున్నాడు.

Advertisement

ఆ ఎర్ర తుండుకు ఒక స్పెషాలిటీ ఉందని ఆ స్పెషాలిటీ ఏంటో వాళ్లకు తెలుసంటూ పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చేలా అలీ కామెంట్స్ చేశారు.ఈ ఎర్ర రక్తం మన శరీరంలో ఉంటే దానికి పవర్ ఎక్కువ అని అలీ పేర్కొన్నారు.ఖుషి డైరెక్టర్ సూర్య అంటూ, ఓజీ నిర్మాత దానయ్య అంటూ అలీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.

అలీ పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని ఈ విధంగా చాటుకోవడాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.అలీ రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకుని మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అలీ సరైన పాత్రలను ఎంచుకుంటే ఆయనకు మరిన్ని విజయాలు దక్కడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

హీరో రవితేజకు జరిగింది పెద్ద ప్రమాదమేనా.. ఈ స్టార్ హీరో త్వరగా కోలుకోవాలంటూ?
Advertisement

తాజా వార్తలు