పవన్ అంటేనే ఇష్టం.. కమెడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు ఆలీ( Ali ) ఒకరు.

బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలీ అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాలలో తన కామెడీ ద్వారా ప్రేక్షకులను నవ్వించి మెప్పించారు.

ఇక ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించిన ఈయన బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే అలీ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలోకి( Politics ) కూడా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.

ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress Party ) మద్దతుగా తెలియచేయడమే కాకుండా గత ప్రభుత్వ హయామంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కూడా పనిచేశారు.ఇక ఈసారి ఎన్నికలలో ఆలీ ఎక్కడ చురుగ్గా పాల్గొనలేదు.అంతేకాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో తాను పూర్తిగా రాజకీయాలకు దూరం అవుతున్నానని నేను ఒక సాధారణ వ్యక్తి లాగా తన ఓటు హక్కును మాత్రమే వినియోగించుకుంటానని, నేను ఏ రాజకీయ పార్టీలకు మద్దతు తెలపనని పూర్తిగా రాజకీయాల నుంచి బయటకు వచ్చారు.

ఈ విధంగా అలీ రాజకీయాల నుంచి తప్పుకొని తన వృత్తిపరమైన జీవితంలో కొనసాగుతూ ఉన్నారు.అయితే ఇటీవల సుమ( Suma ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సుమ అడ్డా( Suma Adda ) అనే కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే సందడి వాతావరణం నెలకొంది.

Advertisement

అయితే సుమ అలీను ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తావన తీసుకువచ్చారు.మీరు ఈ హీరోలలో ఎవరితో చాలా కంఫర్టబుల్ గా నటించడానికి ఇష్టపడతారు.

ఒకటి రవితేజ( Raviteja ) రెండు పవన్ కళ్యాణ్ అనే ఆప్షన్ ఇచ్చారు.ఇక ఈ ప్రశ్నకు ఆలీ ఏ మాత్రం ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ అంటేనే చాలా ఇష్టంగా నటిస్తాను అంటూ సమాధానం చెప్పారు.

దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

పొలాల్లో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ వింటేజ్ ఫోటోలో ప్రభాస్ లుక్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు