దమ్ముంటే కామారెడ్డి చౌరస్తాకు రా..తేల్చుకుందాం అంటూ కేసీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్!

సరిగా మరో 15 రోజుల్లో తెలంగాణ ప్రాంతం లో అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) జరగబోతున్నాయి.

ఈ ఎన్నికలను అన్నీ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

ఎన్ని పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల మధ్యనే ఉన్నాయి.సర్వేలు కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా వస్తే, మరి కొన్ని బీఆర్ఎస్ పార్టీ కి అనుకూలంగా వచ్చాయి.

సోషల్ మీడియా లో ఉన్న ఆదరణ, తెలంగాణ యూత్ లో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, రోజురోజుకి రేవంత్ రెడ్డి కి తెలంగాణ లో పెరుగుతున్న జనాదరణ ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో విజయకేతనం ఎగురవేస్తుందని అంటున్నారు విశ్లేషకులు.అంతే కాదు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో జనాల్లోకి తీసుకెళ్తుంది.

ముఖాయమంత్రి కేసీఆర్( KCR ) పై మరింత వ్యతిరేకత పెంచేలా చేస్తున్నాయి.

Advertisement

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ముఖ్యమంత్రి కేసీఆర్ కి విసిరినా ఒక సవాలు ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ ని మరింత చిక్కులోకి నెట్టేసింది.కామా రెడ్డి జిల్లాలోని క్లాసిక్ హాల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో 24 గంటలు నువ్వు విద్యుత్తూ అందిస్తున్నది నిజమైతే కామారెడ్డి చౌరస్తా లోని అమరవీరుల స్తూపం దగ్గరకి నీ విద్యుత్తు శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagdish Reddy ) ని తీసుకొని వచ్చి నిరూపణ చెయ్యి.అలా కనుక నువ్వు చేస్తే నేను కొండగల్ మరియు కామా రెడ్డి లో నామినేషన్స్ ని ఉపసంహరించుకుంటాను.

ఉచిత విద్యుత్తు ఇస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్.నువ్వు గత ఆరు నెలల నుండి ఉచిత విద్యుత్తు ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నావు, నిబద్దత ఉంటే చర్చలకు రా తేల్చేద్దాం, కేసీఆర్ నా సవాలు ని స్వీకరించాలి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

రేవంత్ రెడ్డి మాటలకు కేసీఆర్ కౌంటర్ ఇస్తాడా లేదా అని అందరూ ఎదురు చూస్తున్నారు.ఒకవేళ కేసీఆర్ ఈ మాటల ప్రస్తావన తీసుకొని రాకపోతే కచ్చితంగా రేవంత్ రెడ్డి మాటలను నిజం చేసినవారు అవుతారు.అందుకే కేసీఆర్, కేటీఆర్ లేదా హరీష్ రావు ఇలా ఎవరో ఒక్కరు కచ్చితంగా రేవంత్ రెడ్డి విసిరిన సవాలు పై మాట్లాడాలి.

లేకపోతే జనాల్లో బీఆర్ఎస్ పార్టీ పై మరింత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు