జాతి ఐక్యతను చాటేలా సాగిన సామూహిక జాతీయ గీతాలాపన : జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

జాతి ఐక్యతను చాటే విధంగా జిల్లాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ తెలిపారు.భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం 11.

30 గంటలకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండి సామూహికంగా జాతీయ గీతాలాపన చేశారని కలెక్టర్ అన్నారు.జిల్లాలోని ప్రతి ట్రాఫిక్ కూడలి వద్ద, ప్రతి గ్రామంలో, ప్రతి ఆవాసంలో, ప్రతి మున్సిపల్ వార్డులో, సినిమా హాళ్లలో, ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయంలో, ప్రతి విద్యా సంస్థలో, ప్రతి వాణిజ్య కేంద్రం వద్ద ప్రజలంతా స్వచ్ఛందంగా సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొని విజయంతం చేశారని కలెక్టర్ తెలిపారు.

స్థానిక జెడ్పి సెంటర్ వద్ద నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్ తో కలిసి కలెక్టర్ పాల్గోన్నారు.ఈ సందర్భంగా, జాతి ఐక్యతను చాటే విధంగా విజయవంతంగా సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని అమలు చేసిన అధికారులను, స్వచ్చందంగా పాల్గొన్న ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, డిఆర్వో శిరీష, ఏసీపీ రమేష్, జిల్లా అధికారులు, సిబ్బంది, వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

డ్రై హెయిర్ ను ఒక్క వాష్ లో సిల్కీగా షైనీ గా మార్చే బెస్ట్ రెమెడీ మీ కోసం!
Advertisement

తాజా వార్తలు