పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన బ్రిడ్జి..!

పెద్దపల్లి జిల్లా( Pedpadalli district )లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది( Bridge Collapses ).

ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో మానేరు నదిపై ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.

అయితే ఈదురుగాలుల బీభత్సానికి బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిందని సమాచారం.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బ్రిడ్జి పిల్లర్లు కుంగిపోయాయి.

నాసిరకం నిర్మాణ పనుల వలనే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలిందని సమీప గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ( Bhupalpally )మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది.

కాగా 2016 ఆగస్టులో సుమారు రూ.49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు.అయితే పనులు ప్రారంభించి తొమ్మిదేళ్లు పూర్తి కావస్తున్నా నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు.

Advertisement
ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి

తాజా వార్తలు