కోకనట్ వెనిగ‌ర్‌ను ఇలా తీసుకుంటే వేగంగా బ‌రువు త‌గ్గొచ్చు!

ఇటీవ‌ల కాలంలో చాలా మంది బ‌రువు త‌గ్గ‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఖ‌ఠిన‌మైన డైట్‌, డైలీ వ‌ర్కౌట్స్‌తో పాటు ఎన్నెన్నో చిట్కాల‌ను ఫాలో అవుతున్నారు.

ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నారా.? అయితే మీకు కోక‌న‌ట్ వెనిగ‌ర్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.కొంద‌రు వెయిట్ లాస్ అయ్యేందుకు ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుంటారు.

కానీ, దాని కంటే ఎఫెక్టివ్‌గా కోక‌న‌ట్ వెనిగ‌ర్ ప‌ని చేస్తుంది.ఈస్ట్ టేస్ట్ ని క‌లిగి ఉండే ఈ కోక‌న‌ట్ వెనిగ‌ర్‌లో బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉంటాయి.

అందుకే ఇది ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంటుంది.ముఖ్యంగా బ‌రువు త‌గ్గ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న వారు.

Advertisement

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వ‌న్ టేబుల్ స్పూన్ కోక‌న‌ట్ వెనిగ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా క‌లిపి సేవించాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే వేగంగా బ‌రువు త‌గ్గుతారు.

అలాగే కోకనట్ వెనిగర్ లో శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్క‌లంగా ఉంటాయి.అందువ‌ల్ల‌, దీనిని డైట్‌లో చేర్చుకుంటే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ స్ట్రోంగ్‌గా మారుతుంది.

వివిధ ర‌కాల వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.ఎనర్జీ లెవల్స్ రెట్టింపు అవుతాయి.

అంతే కాదండోయ్‌.రెగ్యుల‌ర్‌గా త‌గిన మోతాదులో కోక‌న‌ట్ వెనిగ‌ర్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.చ‌ర్మం కాంతి వంతంగా, య‌వ్వ‌నంగా మారుతుంది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ర‌క్త‌పోటు అదుపు త‌ప్ప‌కుండా ఉంటుంది.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.

Advertisement

శ‌రీరంలోని హార్మోన్స్‌ బ్యాలెన్స్ అవుతాయి.ప‌నిపై ఏకాగ్ర‌త పెరుగుతుంది.

కాబ‌ట్టి, బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నించే వారు మాత్ర‌మే కాదు ఎవ్వ‌రైనా కోక‌నట్ వెనిగ‌ర్‌ను తీసుకోవ‌చ్చు.దీనిని రోజూవారీ వంట‌ల్లోనూ వాడ‌వ‌చ్చు.

తాజా వార్తలు