బ్లాక్ హెడ్స్‌ను ఈజీగా తొలిగించే కొబ్బ‌రి పాలు..ఎలా వాడాలంటే?

ముఖ సౌంద‌ర్యాన్ని దెబ్బ తీసే వాటిలో బ్లాక్ హెడ్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

చర్మం క్రింద ఉండే సెబాసియస్ గ్లాండ్స్ సెబమ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి.

దాని వ‌ల్లే బ్లాక్ హెడ్స్ ఏర్ప‌డ‌తాయి.జిడ్డు చ‌ర్మ త‌త్వం క‌ల‌వారికి ఈ బ్లాక్ మెడ్స్ స‌మ‌స్య చాలా ఎక్కువ‌గా ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే వాటిని తొలిగించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే బ్లాక్ హెడ్స్‌ను ఈజీగా తొలిగించ‌డంలో కొబ్బ‌రి పాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అవును, కొబ్బ‌రి పాల‌లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచ‌డంలోనూ, బ్లాక్ హెడ్స్‌ను దూరం చేయ‌డంలోనూ, చ‌ర్మాన్ని స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మార్చ‌డంలోనూ సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఇంత‌కీ కొబ్బ‌రి పాల‌ను చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలి.? అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Coconut Milk Helps To Reduce Blackheads Naturally Coconut Milk, Blackheads, Bea
స్టెప్‌-1:

ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఎండు కొబ్బ‌రి పొడి, రెండు స్పూన్ల‌ కొబ్బ‌రి పాలు, ఒక స్పూన్ బ్రౌన్ షుగ‌ర్ పౌడ‌ర్‌, రెండు స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మానికి చ‌ర్మంపై అప్లై చేసి ఐదు లేదా ఆరు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసుకోవాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్టెప్‌-2:

ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కొబ్బ‌రి పాలు, ఒక స్పూన్ అలోవెర జెల్‌, రెండు బొప్పాయి పండు పేస్ట్‌, ఒక స్పూన్ పెరుగు వేసుకుని బాగా క‌లుపు కోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మానికి చ‌ర్మంపై ప్యాక్‌లా వేసుకోవాలి.

Advertisement
Coconut Milk Helps To Reduce Blackheads Naturally! Coconut Milk, Blackheads, Bea

ప‌ది లేదా ప‌ది హేను నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి.అపై చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఈ రెండు స్టెప్స్‌ను పాటిస్తే గ‌నుక బ్లాక్ హెడ్స్ సులభంగా పోతాయి.మ‌రియు చ‌ర్మం తేమ‌గా, గ్లోగా మారుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు