త్వరలోనే ఇండియాలో కోకాకోలా స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఆ ఫోన్ ఫీచర్లు ఇవే!

శీతల పానీయాల కంపెనీ కోకాకోలా గురించి తెలియని వారు ఉండరు.ఈ కంపెనీ తయారు చేసే డ్రింక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి.

డ్రింక్స్ మార్కెట్‌లో ఎంతోకాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న ఈ బ్రాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.అయితే తాజాగా ఈ కంపెనీ ఒక స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమయ్యిందని వార్తలు వస్తున్నాయి.

నిజానికి ఇంతకు ముందెన్నడూ టెక్నాలజీ ఉత్పత్తిని తయారు ఈ కంపెనీ తయారు చేయలేదు.

చాలా కంపెనీలు తమ ప్రధాన వ్యాపారానికి మించి విస్తరిస్తున్నాయి.కోకా కోలా కూడా ఇదే చేయనుందని కొందరు అంటున్నారు.భారతీయ మార్కెట్లో మొబైల్ ఫోన్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి.

Advertisement

కొత్త ఫోన్లను ఎంకరేజ్ చేయడంలో ఇండియన్స్ ఎప్పుడూ ముందుంటారు.అందుకే ఈ కంపెనీ ఇండియాలో తన తొలి స్మార్ట్ ఫోన్ తీసుకురావడానికి సిద్ధమైందని కొందరు పేర్కొంటున్నారు.

ఈ ఫోన్‌ను కోలా ఫోన్ అని పిలుస్తారట.త్వరలో భారతదేశంలో ఫోన్ విడుదలవుతుందని కొందరు భావిస్తున్నారు.

కోకాకోలా తన ఫోన్‌ను తయారు చేయడానికి ఒక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌తో కలిసి పని చేస్తోందని సమాచారం.ఈ అప్‌కమింగ్ ఫోన్ స్పెక్స్ లేదా ధర గురించి ఇంకా పెద్దగా తెలియదు.అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

భారతదేశంలోని ఒక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నాన్-టెక్ బ్రాండ్‌తో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి కాదు.ఈ లాంచ్ కోకా-కోలాకు మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!

పాప్ సంస్కృతిలో మరింత ప్రజాదరణ పొందేందుకు అవకాశం ఇస్తుందిటిప్‌స్టర్స్‌ ప్రకారం, ఈ ఫోన్‌లో వెనుకవైపు డ్యూయల్ కెమెరాలు ఉండగా వాటిలో ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్, మరొకటి టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, బ్లూటూత్, GPS, 5G, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉండవచ్చు.

Advertisement

ఇది మీడియాటెక్ హీలియో G99 చిప్‌తో అందుబాటులోకి రావచ్చు.

తాజా వార్తలు