ఢిల్లీ పోలీసుల నోటీసులపై సీఎం రేవంత్ రియాక్షన్

ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) స్పందించారు.

బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా( Amit Shah ) నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు.

సోషల్ మీడియాలో బీజేపీని( BJP ) ప్రశ్నించినందుకు తనతో పాటు గాంధీభవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు( Delhi Police Notices ) ఇస్తున్నారని మండిపడ్డారు.ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారని తెలిపారు.

అయితే రిజర్వేషన్ల రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఉన్న ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ కాంగ్రెస్ పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బీజేపీ ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు.

చైనా: వామ్మో, రైతుపై విరుచుకుపడిన పెద్ద పులి.. వీడియో చూస్తే..
Advertisement

తాజా వార్తలు