పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు.ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో ఈ సమావేశం జరగనుంది.

మొత్తం ఏడు పార్లమెంట్ స్థానాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు.హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్ గిరి, మెదక్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఎంపీ స్థానాలపై నిర్వహించనున్న సమీక్షకు జిల్లా మంత్రులతో పాటు ఇంఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

ఇందులో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement