ఢిల్లీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే కవితకు మద్ధతుగా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీలో మకాం వేశారు.మరోవైపు తాజా పరిస్థితులపై ముఖ్య నేతలతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారని సమాచారం.
అయితే ఇవాళ్టి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరు కాలేకపోతున్నానని సమాచారం అందించిన విషయం తెలిసిందే.







