విపక్షాలపై సీఎం జగన్ విమర్శలు

విపక్షాలపై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేకపోతున్నారని తెలిపారు.

టీడీపీ అంటే తినుకో, దండుకో, పంచుకోనని పేర్కొన్నారు.14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం మంచి చేయలేదని సీఎం జగన్ వెల్లడించారు.ఏ ప్రాంతానికి, ఏ సామాజిక వర్గానికి మంచి జరగలేదన్నారు.

ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారన్న ఆయన మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు.కొంతమంది తరహాలో మనం పూనకం వచ్చినట్లు మాట్లాడలేమని తెలిపారు.

దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ గతంలో ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు.దత్త పుత్రుడు ఓ లారీ ఎక్కడు.

దాని పేరు వారాహి అంటూ విమర్శించారు.ఈ మనిషి నోటికి అదుపులేదు.

Advertisement

మాటకు నిలకడ లేదంటూ ఎద్దేవా చేశారు.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు