ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా సి.ఎం జగన్ 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
కడియంలో సైకత శిల్పంతో ముఖ్యమంత్రి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఆకట్టుకుంటోంది.వై.సి.పి రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ఆధ్వర్యంలో ఒడిశాకు చెందిన కళాకారులు 15 అడుగుల ఎత్తు… 25 అడుగుల వెడల్పుతో ఇసుక చిత్రాన్ని తీర్చిదిద్దారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా అమలు చేస్తున్న నవరత్నాల పేర్లను సైకత శిల్పంపై చెక్కారు.ఆంధ్రప్రదేశ్ గుండెచప్పుడు సి.ఎం జగన్ అని పేర్కొన్నారు.ఆరు లారీల ఇసుకను ఈ శిల్పం చెక్కేందుకు వినియోగించారు.