CM Jagan : రెండో రోజు బస్సు యాత్రలో చంద్రబాబుపై సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

"మేమంతా సిద్ధం"( memantha siddam ) రెండో రోజు బస్సు యాత్రలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్( CM Jagan ) టీడీపీ అధినేత చంద్రబాబుపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

నారావారి పాలన రాకుండా చేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు.

గతంలో చంద్రబాబు అబద్ధాలు, మోసాలు చూసాం.మరోసారి ఎన్నికలలో గెలవడానికి తోడేలు మాదిరిగా కలిసికట్టుగా వస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చంద్రబాబుకు( Chandrababu ) ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం.

ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి.ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Advertisement
Cm Jagan Serious Comments On Chandrababu During The Second Day Of The Bus Trip-

గడిచిన 58 నెలలలో ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమ అందించామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

Cm Jagan Serious Comments On Chandrababu During The Second Day Of The Bus Trip

లంచాలు విపక్ష లేని పాలన అందించాం.గతంలో పిల్లల చదువు కోసం ఎవరు పట్టించుకోలేదు.నాడు నేడుతో ప్రభుత్వ రూపురేఖలు మార్చాం.

విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ప్రవేశపెట్టాం.ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 25 లక్షల ఖర్చు వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం.

ఎక్కడ చూసినా విలేజ్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి.చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒకటి లేదని సీఎం జగన్ అన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..

బాబు చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం.బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నది గర్వ కారణం.

Advertisement

బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం.అందరూ ఆలోచన చేయాలి.

వీరు ఈ రాష్ట్రానికి ఏం మంచి చేశారని మళ్లీ మన ముందుకు వస్తున్నారు.? బాబు పేరు చెబితే బషీరాబాగ్ కాల్పులు, కరువు కాటకాలు గుర్తుకొస్తాయి అని జగన్ విమర్శించారు.

తాజా వార్తలు