కడప లో జరిగిన ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో మామిళ్ళపల్లె శివారులో ముగ్గు రాయి క్వారీలో భారీ పేలుడు సంభవించింది.

దాదాపు ఈ ఘటనలో పది మంది మృతి చెందినట్లు సమాచారం.

ముగ్గురాయి తొలగించడానికి వాహనంలో జిలెటిన్ స్టిక్స్ తీసుకువస్తుండగా ఒక్కసారి అదుపు తప్పటంతో స్టిక్స్ పేలి వాహనం తునాతునకలు అయ్యింది.దాదాపు 10 మంది చనిపోవడంతో ఉన్నతాధికారులు చేరుకోవడంతో వెంటనే విషయం తెలుసుకొని సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

CM Jagan Expressed Shock Over The Incident In Kadapa Ys Jagan, Kadapa, Chandraba

మరి కొంతమంది ఆసుపత్రిలో జాయిన్ అవటంతో వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు.

పేలుడు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిలెటిన్ స్టిక్స్ పేలుడు ధాటికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు