నేడు బాబు .. రేపు జగన్ ! పేలుడు ఘటన బాధితులకు పరామర్శ 

నిన్న అచ్యుతాపురం లోని( Atchutapuram ) ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో దాదాపు 17 మంది సంఘటన స్థలంలోనే మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఏపీ ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టింది.

మృతుల కుటుంబాలకు కేంద్రం రెండు లక్షలు, క్షతగాత్రులకు 50000 పరిహారాన్ని ప్రకటించారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పేలుడు ఘటనను చాలా సీరియస్ గానే తీసుకుని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

ఈ రోజు ఘటన స్థలానికి టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) వెళ్తున్నారు.దుర్ఘటనకు కారణాలను స్వయంగా తెలుసుకోవడంతో పాటు,  బాధితులను నేరుగా పరామర్శించి వారితో మాట్లాడిన అనంతరం పరిహారాన్ని ప్రకటించనున్నారు.ఇక ఘటన స్థలానికి వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్( Jagan ) సైతం రేపు వెళ్ళనున్నారు.

Advertisement

ఇప్పటికే ఈ ఘటనపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.స్థానిక వైసిపి నాయకులతోనూ మాట్లాడి వివరాలను తెలుసుకుని, అక్కడ బాధితులకు అన్ని విధాలుగా సహకరించాలని పార్టీ కేడర్ కు సూచించారు.

  వాస్తవంగా ఈరోజు జగన్ ఘటన స్థలానికి వెళ్లాల్సి ఉన్నా.

ఈ రోజు చంద్రబాబు పర్యటన ఉండటంతో రేపటికి తన షెడ్యూల్ ను జగన్ మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.గత వైసిపి ప్రభుత్వ హయంలో ఎల్జి పాలిమర్స్ దుర్ఘటన జరిగిన సమయంలో మరణించిన వారి కుటుంబానికి కోటి రూపాయలు చొప్పున అప్పటి ప్రభుత్వం పరిహారం అందించింది.

ఇప్పుడు కూడా అదే తరహాలో పరిహారం అందించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.ఈరోజు చంద్రబాబు రేపు జగన్ పర్యటన సందర్భంగా ముందస్తుగా భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.

నాగ శౌర్య వరుస ప్లాప్ లకి కారణం ఏంటి..? ఎందుకు ఆయనకు మాత్రమే ఇలా జరుగుతుంది...
Advertisement

తాజా వార్తలు