నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు.ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో మూసివేసినట్లు తెలిపారు.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది.సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా 9,833 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 7,190 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,576 క్యూసెక్కులతో పాటు ఎస్ఎల్బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 400 క్యూసెక్కులు మొత్తంగా 53,399 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.







