ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు పుటమి ఉన్నంతవరకు ప్రజల్లో చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి లక్ష్మీశ పేర్కొన్నారు.మంగళవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా వారిరువురు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం జైల్ రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారిరువురూ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజల గుండెల్లో ఎప్పుడూ చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని పేర్కొన్నారు.ఆయన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు అని అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పని చేశారని తెలిపారు.
అంతేకాకుండా ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయక పాత్ర పోషించారని తెలిపారు.మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీ కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందాలని పేర్కొన్నారు.
ఎంతటి మహోన్నతమైన వ్యక్తిని మనం ఎప్పుడు గుర్తించుకోవాలని ఆయన పాలనా దక్షతను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
అనంతరం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ ఎన్ ఎస్ ఎన్ రెడ్డి 31వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు రమణీ, వర్మ , వై శ్రీనివాసరావు, చీఫ్ సిటీ ప్లానర్ సురేష్ ,కార్యదర్శి నల్లనయ్య, జోన్ల్ కమిషనర్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు
.