లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) సినిమాటిక్ యూనివర్స్( LCU ) లో భాగంగా ఇటీవల విజయ్( Vijay ) లియో( Leo ) సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల చేరుకోలేక పోయిందని చెప్పాలి.ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.తాజాగా లియో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పై సినిమా కెమెరామెన్ మనోజ్ పరమహంస ( Manoj Paramahamsa )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కెమెరామెన్ మనోజ్ పరమహంస తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.లియో సినిమాలో చూపించిన ఫ్లాష్ బ్యాక్ ఒక ఫేక్ స్టోరీ కూడా కావొచ్చు.అసలు ముందు కథలో ఫ్లాష్ బ్యాక్ లేదు.
ఆ కారణం చేతనే ఫ్లాష్ బ్యాక్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదని తెలియజేశారు. జైలులో మన్సూర్ చెప్పిన స్టోరీ అబద్దం అయి కూడా ఉండొచ్చు అని అన్నాడు.
ఈ సినిమా గురించి కెమెరామెన్ మనోజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.
సినిమా విషయంలో లోకేష్ ఎలాంటి ట్విస్ట్ ప్రేక్షకులకు ఇవ్వదలుచుకున్నారు.లియో సినిమా విషయంలో లోకేష్ ఇంకేం స్కెచ్ వేశాడో, లియోకి సీక్వెల్ ఉంటుందా? మరి లియో దాస్ ఉన్నాడా లేడా? లియో ఫ్లాష్ బ్యాక్ ఇంకేదైనా సినిమాకి కనెక్ట్ చేస్తాడా అని కామెంట్స్ చేస్తూ లోకేష్ రాబోయే సినిమాల కోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఏది ఏమైనా ఫోటోగ్రాఫర్ మనోజ్ పరమహంస సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఈ సినిమా సీక్వెల్ గురించి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy