నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేసులో సీఐడీ దర్యాప్తు..!!

నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్( Passport ) జారీ కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇప్పటికే పలువురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

కొంతమందికి వీసాలు సైతం జారీ అయినట్లుగా సీఐడీ అధికారులు( CID Officials ) గుర్తించారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కెనడా, స్పెయిన్ వీసాలు మంజూరు కావడంపై సీఐడీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

కేసు దర్యాప్తులో భాగంగా పలువురి పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే ఐదు జిల్లాల్లో సోదాలు నిర్వహించిన సీఐడీ నకిలీ పత్రాలతో 92 మంది పాస్ పోర్టులను పొందారని గుర్తించిన విషయం తెలిసిందే.నకిలీ ధృవీకరణ పత్రాలతో పాస్ పోర్టులను ముఠా సభ్యులు ఇస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.నకిలీ పాస్ పోర్టులతో పాటు నకిలీ ఆధార్, ఓటర్ ఐడీ కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు( Educational Certificates ) తయారీ చేస్తున్నట్లు గుర్తించారు.

Advertisement
మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు