తెలుగులో చాలా మంది కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లు గా మారి మంచి విజయవంతమైన సినిమాలు చేశారు.వాళ్ళెవరో ఒకసారి మనం తెలుసుకుందాం… తెలుగులో ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా మాస్టర్ నువ్వువస్తానంటే నేను వద్దంటాన అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయింది దాంతో ఆ తర్వాత ప్రభాస్ తో పౌర్ణమి తీశాడు అది ప్లాప్ అయింది ఆ తర్వాత కూడా చాలా సినిమాలకి డైరెక్షన్ చేశాడు ప్రస్తుతం ఇంకా కొన్ని సినిమాలని డైరెక్షన్ చేయడానికి లైన్ లో పెట్టాడు…

ఇక ఈయన తర్వాత రాఘవ లారెన్స్ గురించి చెప్పాలి తెలుగు లో చిరంజీవి లాంటి టాప్ హీరో కి కొరియోగ్రఫీ చేసిన లారెన్స్ మాస్టర్ కూడా నాగార్జున హీరోగా వచ్చిన మాస్ సినిమాతో డైరెక్టర్ గా మారాడు.ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత ముని సీరీస్ లో తెరకెక్కిన కాంచన, గంగ లాంటి సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన రెబల్ సినిమా మాత్రం ప్లాప్ అయింది.ఇక ఇప్పుడు స్టార్ హీరోలని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు…

ఇక వీళ్ళ తర్వాత ఆ లిస్ట్ లో ఉన్న కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాస్టర్. ఈయన గోపిచంద్ ని హీరోగా పెట్టీ రణం సినిమా తీశాడు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో, రవితేజ తో ఖతర్నక్ సినిమా తీశాడు ఈ సినిమా డిజాస్టర్ అయింది దాంతో అమ్మ రాజశేఖర్ కెరియర్ డైరెక్టర్ గా అంత సక్సెస్ కాలేదనే చెప్పాలి…ఇలా కొరియోగ్రాఫర్లు డైరక్టర్లు గా మారి చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి…








