చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల బీభత్సం.. ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.కుప్పంలో గజరాజులు చేసిన దాడులలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

వేరువేరు ప్రాంతాల్లో నలుగురిపై రెండు ఏనుగులు దాడికి పాల్పడ్డాయి.ఈ ఘటనలలో ఇద్దరు మరణించగా.

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మృతులు కుప్పం మండలం పర్తిచేను గ్రామానికి చెందిన ఉష, సప్పానికుంట గ్రామానికి చెందిన శివలింగంగా గుర్తించారు.

ఏనుగుల దాడుల నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

Advertisement

అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులకు అడవిలోకి మళ్లించాలని కోరుతున్నారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement