పాపం 'వీరయ్య'పై ఆశలు పెట్టుకున్న ఆ నలుగురికి మొండి చెయ్యి తప్పలేదుగా?

ఎన్నో రోజులుగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యింది.మెగాస్టార్ నటించిన ”వాల్తేరు వీరయ్య” సినిమాతో సంక్రాంతి సందడి తీసుకు వచ్చాడు.

 Chiranjeevi Waltair Veerayya Movie Characters, Megastar Chiranjeevi, Waltair Vee-TeluguStop.com

సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఫారిన్ లో కూడా వాల్తేరు వీరయ్య సందడి కనిపిస్తుంది.రొటీన్ కమర్షియల్ సినిమా అయినా కూడా మెగా ఫ్యాన్స్ ను మెప్పించే అన్ని ఎలిమెంట్స్ తో డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు.

వింటేజ్ చిరుని చూపించి మెగా ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ అనేలా చేయడంతో నూరుశాతం సక్సెస్ అయ్యాడు.చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’.

ఇక చిరుతో పాటు రవితేజ, దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యారు.అయితే ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నలుగురికి మాత్రం మొండి చెయ్యి మిగిలింది.

మరి ఆ నలుగురు ఎవరంటే.ఒకటి ప్రకాష్ రాజ్ కాగా.మిగతా ముగ్గురు ఈ సినిమాలో మెరిసిన ముద్దుగుమ్మలు.ఈ సినిమాలో విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ మాత్రం రొటీన్ విలన్ గానే కనిపించినట్టు కామెంట్స్ వచ్చాయి.

అలాగే శృతి హాస్సన్ రా ఏజెంట్ పాత్రలో నటించిన పెద్దగా సన్నివేశాలు ఏమీ లేవు.ఏదో గ్లామరస్ గా పాటల కోసం మాత్రమే ఈమెను తీసుకున్నట్టు విమర్శలు వచ్చాయి.

అలాగే రవితేజ భార్య పాత్రలో నటించిన కేథరిన్ కు కూడా గుర్తింపు లభించే పాత్ర దొరకలేదు.ఈమెకంటూ ఏ డైలాగ్స్ లేకుండా గ్లామర్ డాల్ ను నిరాశ పరిచారు.ఇక ఈ సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో మిస్ ఇండియా ఊర్వశి రౌతేలా ఒక అనిపించినా ఈమె కేవలం పాటకు మాత్రమే పరిమితం అయ్యింది.ఈమె ఎప్పటి నుండో టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంది.

కానీ ఈ సినిమాతో ఈమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కలేదు.ఇలా ఓవరాల్ గా ఈ నలుగురికి ఈ సినిమా పెద్ద హ్యాండ్ ఇచ్చింది అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube