మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ ఈ నెల 5వ తేదీన థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది.గాడ్ ఫాదర్ సక్సెస్ గురించి తాజాగా ఒక మ్యాగజైన్ తో ముచ్చటించిన చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సక్సెస్ సాధించిన సినిమాలను రీమేక్ చేయడం ఛాలెంజ్ తో కూడుకున్న పని ఆయన అన్నారు.ఎందుకంటే ఒరిజినల్ స్టోరీని అందరూ చూసి ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు.
ఒరిజినల్ స్టోరీకి ఏ మాత్రం తగ్గకుండా కథను నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.గతంలోనూ నేను రీమేక్ సినిమాలలో నటించానని ఆయన అన్నారు.
అయితే రామ్ చరణ్ చెప్పడం వల్లే నేను గాడ్ ఫాదర్ మూవీలో నటించానని ఆయన కామెంట్లు చేశారు.గాడ్ ఫాదర్ మూవీ ఎప్పటికీ నాకు స్పెషలే అని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో నా పాత్రకు కామెడీ డైలాగ్స్, డ్యాన్స్ లు ఉండవని ఆయన కామెంట్లు చేశారు.
నా భార్య సురేఖ పెద్ద క్రిటిక్ అని చిరంజీవి తెలిపారు.ఏదైనా నచ్చని పక్షంలో సురేఖ వెంటనే చెప్పేస్తుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.సురేఖ అభిప్రాయాన్ని కూడా ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటానని చిరంజీవి కామెంట్లు చేశారు.
ప్రస్తుతం సౌత్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని అయితే అన్ని సౌత్ సినిమాలు సక్సెస్ సాధించడం లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు.బాలీవుడ్ నుంచి వచ్చిన ప్రతి సినిమా సక్సెస్ సాధించడం లేదని సినిమా ఏ ప్రాంతానిది అనే విషయం ముఖ్యం కాదని కంటెంట్ మాత్రమే ముఖ్యమని చిరంజీవి కామెంట్లు చేశారు.
థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేది కంటెంట్ మాత్రమే అని చిరంజీవి అన్నారు.ప్రాంతీయ చిత్రం అనే ట్యాగ్ ను వదిలేయాలని చిరంజీవి కామెంట్లు చేశారు.